Saru Thoughts

Saru Thoughts

Share

Devotional Information

02/10/2026

May this Gandhi Jayanti inspire us to choose kindness over anger and truth over fear. Warm wishes to you and your loved ones on this special day.

Happy Gandhi Jayanthi 🎊💐

27/09/2026

2026లో మహాలయ పక్షం తేదీలు

ఈ పవిత్రమైన రోజులలో పూర్వీకులను స్మరించుకుని శ్రాద్ధం, తర్పణం మరియు పిండప్రదానం వంటి పితృకార్యాలు నిర్వహిస్తారు.

27/09/2026

🕉️*27 సెప్టెంబర్ 2026*🕉️
పితృ పక్షాలు - పాడ్యమి శ్రద్ధ

పాడ్యమి : Sep 26 10:18 PM to Sep 27 08:58 PM
విదియ: Sep 27 08:58 PM to Sep 28 07:13 PM

26/09/2026

దీర్ఘ సుమంగళీ యోగ శ్లోకం

సుధామప్యాస్వాద్య ప్రతిభయ-జరా-మృత్యు-హరిణీం
విపద్యంతే విశ్వే విధి-శతమఖాద్యా దివిషదః |
కరాళం యత్క్ష్వేలం కబలితవతఃకాలకలనాన శంభోస్తన్మూలం తవ జనని తాటంకమహిమా ||

శ్లోక విశిష్టత & ఫలితంఫలితం:
వివాహిత స్త్రీలు ఈ శ్లోకాన్ని భక్తితో రోజూ పఠించడం వల్ల తమ భర్తకు సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయి

(దీర్ఘ సుమంగళీ ప్రాప్తి)సమయం: ఉదయం లేదా సాయంత్రం పూజా సమయంలో దీపం వెలిగించి, అమ్మవారిని ధ్యానిస్తూ కనీసం 3 లేదా 11 సార్లు చదవడం మంచిది.

26/09/2026

🕉️25 సెప్టెంబర్ 2026🕉️ శనివారం గ్రహబలం పంచాంగం

🚩పితృ పక్షాలు ప్రారంభం🚩
🚩పితృ పక్షాలలో పూర్ణిమ శ్రద్ధ🚩
🚩భాద్రపద పూర్ణిమ🚩

శనివారం గ్రహాధిపతి "శనైశ్చరుడు" మరియు "రాహువు".

శనైశ్చరుని అధిష్టాన దైవం "శ్రీ బ్రహ్మ దేవుడు", మరియు "శ్రీ యమధర్మ రాజు". శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం శనైశ్చరాయ నమః ||
2. ఓం బ్రహ్మణే నమః ||
3. ఓం యమాయ నమః ||
4. ఓం విష్ణవే నమః ||

శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహా విష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని, సందర్శించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి.

రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గా దేవి, మరియు నాగ (సర్ప) దేవతలు. రాహువు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం రాహవే నమః ||
2. ఓం దుం దుర్గాయై నమః ||
3. ఓం సర్పేభ్యో నమః ||

రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గ మాత ఆలయాలను రాహుకాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) సందర్శించండి. శ్రీ దుర్గ సప్త శ్లోకి స్తోత్రం, శ్రీ దుర్గ సూక్తం పఠించండి.

శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయాల్సిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి.

గ్రహ బలం కొరకు, శనివారం నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించండి. శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ఆయుష్షు పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తుంది, ప్రతి పనిలో శుభం చేకూరుతుంది.

అమృత కాలం:
లేదు

దుర్ముహూర్తం:
07:44 AM – 08:32 AM

వర్జ్యం:
08:58 PM – 10:32 PM

🕉️🕉️

శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, శుక్ల పక్షం,

తిథి:
పూర్ణిమ: Sep 25 11:07 PM to Sep 26 10:18 PM
పాడ్యమి : Sep 26 10:18 PM to Sep 27 08:58 PM

పూర్ణిమ ఏదైనా పనిని పూర్తి చేయడానికి అనుకూలమైన పూర్ణ తిథి. పూర్ణిమ ముఖ్యమైన వ్యాపారాలు, నిర్మాణాలు, పదవులు, భక్తి కార్యక్రమాలు, ఇంటి పని, శారీరక కార్యకలాపాలు వంటివి ప్రారంభించడానికి అనుకూలమైన తిథి.

పూర్ణిమ తిథి చంద్రోదయం తరువాత చంద్రుని దీప దూప నైవేద్యాలతో ప్రత్యక్షంగా పూజించడానికి, శ్రీ లలిత అమ్మవారిని ఆరాదించడానికి, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.

🕉️🕉️

నక్షత్రం:
పూర్వభాద్రపద: Sep 25 11:22 AM to Sep 26 11:31 AM
ఉత్తరాభాద్రపద Sep 26 11:31 AM to Sep 27 11:08 AM

25/09/2026

శుభోదయం శుభ ఆదివారం 🙏🏻🙏🏻🙏🏻

25/09/2026

🕉️25 సెప్టెంబర్ 2026🕉️ శుక్రవారం గ్రహబలం పంచాంగం

🚩గణేష్ విసర్జన్🚩

శుక్రవారం గ్రహాధిపతి "శుక్రుడు". శుక్రుని అధిష్టాన దైవం "శ్రీ మహాలక్ష్మి" మరియు "శ్రీ ఇంద్రాణి".

శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం శుక్రాయ నమః ||
2. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః ||
3. ఓం ఇంద్రాణియై నమః ||

శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహా లక్ష్మీ సమేత శ్రీ మహా విష్ణు ఆలయాలను దర్శించండి. శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించండి.

శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం, వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు, మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం మానుకోండి.

గ్రహ బలం కొరకు, శుక్రవారం గులాబీ, తెలుపు, ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. శుక్రవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, స్త్రీలకు మంచి ఫలితాలు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతుంది.

అమృత కాలం:
03:23 AM – 05:00 AM

దుర్ముహూర్తం:
08:32 AM – 09:20 AM, 12:31 PM – 01:19 PM

వర్జ్యం:
05:48 PM – 07:25 PM

🕉️🕉️

శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, శుక్ల పక్షం,

తిథి:
చతుర్దశి: Sep 24 11:18 PM to Sep 25 11:07 PM
పూర్ణిమ: Sep 25 11:07 PM to Sep 26 10:18 PM

చతుర్దశి మంచి పనులకు ప్రతికూలమైన రిక్త తిథి. చతుర్దశి రోజు ఎటువంటి ముఖ్యమైన పనులు, వ్యాపారాలు, ప్రయాణాలు చేయకూడదు. సాధారణ పని మాత్రమే చేయండి. మంత్రాలు, స్తోత్రాలు పఠించండి.

చతుర్దశి తిథి, శివాలయ సందర్శనకు, ప్రత్యేకించి సూర్యాస్తమయం తరువాత ప్రదోష వేళలో శివాలయ సందర్శనకు, శివ మంత్రాలు, శివ స్తోత్రాలు, శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.

🕉️🕉️

నక్షత్రం:
శతభిషా: Sep 24 10:35 AM to Sep 25 11:22 AM
పూర్వభాద్రపద: Sep 25 11:22 AM to Sep 26 11:31 AM

శతభిష నక్షత్రానికి అధిపతి "రాహువు". అధిష్టాన దేవత "వరుణ". ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం.

శతభిష నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం రాహవే నమః ||
2. ఓం వరుణాయ నమః ||

శతభిష నక్షత్రం ఉన్నరోజు - ప్రయాణాలు, రవాణా, తోటపని, ఊరేగింపులకు వెళ్లడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయడం, నిత్య వ్యవహారాలలో పాల్గొనడం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన అన్ని పనులకు అనుకూలం.

24/09/2026

అమ్మవారి కృప మన అందరిపైన ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

24/09/2026

కేతు గ్రహ శ్లోకం 7 సార్లు వింటే సకల పాపాలు తొలగిపోతాయి

23/09/2026

🕉️24 సెప్టెంబర్ 2026🕉️ గురువారం గ్రహబలం పంచాంగం

🚩గురు ప్రదోష వ్రతం🚩

గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి). గురువు యొక్క అధిష్టాన దైవం "శ్రీ ఇంద్రుడు" మరియు "శ్రీ దక్షిణామూర్తి".

గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం బృహస్పతయే నమః ||
2. ఓం ఇంద్రాయ నమః ||
3. ఓం దక్షిణామూర్తయే నమః ||
4. ఓం విష్ణవే నమః ||
5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ||

శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు, శ్రీ దత్తాత్రేయ, మరియు శ్రీ సాయిబాబా ఆలయాలు కూడా దర్శించండి.

గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికీ దూరంగా వుండండి.

గ్రహ బలం కొరకు, గురువారం పసుపు మరియు బంగారం రంగు దుస్తులు ధరించండి. గురువారం గోళ్లు కత్తిరిస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది.

అమృత కాలం:
03:55 AM – 05:34 AM

దుర్ముహూర్తం:
10:08 AM – 10:56 AM, 02:55 PM – 03:43 PM

వర్జ్యం:
06:01 PM – 07:40 PM

🕉️🕉️

శ్రీ పరాభవ నామ సంవత్సరం, భాద్రపద మాసం, శుక్ల పక్షం,

తిథి:
త్రయోదశి: Sep 23 10:50 PM to Sep 24 11:18 PM
చతుర్దశి: Sep 24 11:18 PM to Sep 25 11:07 PM

త్రయోదశి విజయాన్ని ప్రసాదించే జయ తిథి. ఈ తిథిని ప్రదోషం అని కూడా పిలుస్తారు. ప్రదోషం ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించచడం, కొత్త బట్టలు, ఆభరణాలు ధరించడం, పోరాటం, శత్రువులను నిర్మూలించడం, మరియు ఇంద్రియ భోగాలు ఆనందించడం వంటి వాటికి అనుకూలమైన తిథి.

త్రయోదశి తిథి, ప్రత్యేకించి సూర్యాస్తమయం తరువాత ప్రదోష వేళలో శివాలయ సందర్శనకు, శివ, నందీశ్వర, మరియు దక్షిణామూర్తి ఆరాధనకు, శివ మంత్రాలు, శివ స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.

🕉️🕉️

నక్షత్రం:
ధనిష్ఠ: Sep 23 09:09 AM to Sep 24 10:35 AM
శతభిషా: Sep 24 10:35 AM to Sep 25 11:22 AM

ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి "అంగారకుడు". అధిష్టాన దేవత "వసు". ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం.

ధనిష్ఠ నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం భౌమాయ నమః ||
2. ఓం వసుభ్యో నమః ||

ధనిష్ఠ నక్షత్రం ఉన్నరోజు - ప్రయాణాలు, రవాణా, తోటపని, ఊరేగింపులకు వెళ్లడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయడం.

Address

Bangalore
560087

Alerts

Be the first to know and let us send you an email when Saru Thoughts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Bangalore.